Skip to main content

Part Time Job: వర్క్‌ ఫ్రం హోం ఆశ చూపి రూ.4.30 లక్షల వంచన

హుబ్లీ: ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నుంచే పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మహిళను నమ్మించి రూ.4.30 లక్షలను మోసగించిన ఘటన నగరంలో జరిగింది.
Part Time Job
వర్క్‌ ఫ్రం హోం ఆశ చూపి రూ.4.30 లక్షల వంచన

 ధార్వాడ సైదాపుర గౌడర వీధికి చెందిన నిఖిత బాధితురాలు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఉందంటూ సదరు వ్యక్తులు సందేశం పంపించారు. తర్వాత ఇన్‌స్టా పేజ్‌ పంపించి ఫాలో కావాలని సూచించారు. ఆ మేరకు తొలుత రూ.50లను బాధితురాలి ఖాతాకు బదలాయించి రూ.150 నుంచి రూ.300 వరకు ఆమె ఖాతాలోకి వేశారు.

చదవండి: TCS, Infosys: వ‌ర్క్ ఫ్రం హోంకు బైబై.. ఆఫీస్‌కు రాని వారిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం... 10 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం..!

అంతేగాక రూ.1000 లక్ష్యంగా పెట్టి రూ.3 వేలను మరో సారి ఆమె ఆకౌంట్లోకి బదిలీ చేశారు. దీన్ని నమ్మిన ఆమె నుంచి దశల వారీగా రూ.4.30 లక్షలను వంచకులు వారి ఖాతాలోకి వేయించుకొన్నారని ఆమె హుబ్లీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: Return To Office: ఆఫీస్‌ల‌కు క‌చ్చితంగా రావాల్సిందే... ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేస్తున్న ఐటీ కంపెనీలు... ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే

Published date : 24 Aug 2023 12:59PM

Photo Stories