Return To Office: ఆఫీస్‌లకు కచ్చితంగా రావాల్సిందే... ఉద్యోగులకు స్పష్టం చేస్తున్న ఐటీ కంపెనీలు... ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే

రాత్రికి రాత్రే ఉద్యోగుల పనితీరు వృత్తి నైపుణ్యాన్ని అవమానపరిచేలా, అస్పష్టమైన అటెండెన్స్ ట్రాకింగ్ పద్ధతులకు అనుకూలంగా మారిపోవడం విచారకరం అంటూ గూగుల్ ఉద్యోగి క్రిస్ ష్మిత్ పేర్కొన్నారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు చెందిన కొంతమంది కాంట్రాక్ట్ ,ప్రత్యక్ష ఉద్యోగుల తరపున ఆయన ఈ ప్రకటన జారీ చేశారు.
చదవండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో భౌతికంగా హాజరయ్యేలా మార్చిలో, గూగుల్ తన హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్‌డేట్ చేసింది. తాజాగా వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రాకుంటే చర్యలు తప్పవని గూగుల్ ఉద్యోగులకు గూగుల్ హెచ్చరించింది.
చదవండి: 65 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఎంబీఏ అమ్మాయి... అత్యధిక వేతనంతో రికార్డు

అంతేకాదు రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులకు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ ఇవ్వనున్నామని, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేసింది. అంటే అటెండెన్స్ సరిగా లేని వారికి శాలరీ హైక్స్, ప్రమోషన్స్‌లో ప్రభావం పడనుంది.
Work From Home: లక్షల జీతం ఏం చేసుకోను...మనశ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేదన..!

ఉద్యోగులు చాలామంది తిరిగి ఆఫీసులకు వస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అలాగే హైబ్రిడ్ పని విధానం, ఇంటి నుండి పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పోల్చి చూసేలా దీన్ని డిజైన్ చేశామని గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోంట్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆఫీసులో టీంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని వ్యాఖ్యానించడం గమనార్హం.
☛ అయ్యో పాపం... చేరిన ప్రతీ కంపెనీలోనూ మొండిచేయే...

కాగా ఉద్యోగులను తిరిగి పనిలోకి రావాలంటున్న కంపెనీల్లో గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్ కూడా గతంలోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 2వేల మంది అమెజాన్ ఉద్యోగులు వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ఆదేశాలు, సామూహిక తొలగింపులు వ్యతిరేకంగా గతంలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగుల తాజా ప్రకటన చర్చకు దారీ తీస్తోంది.