Job Fair: జాబ్‌మేళాకు విశేష స్పందన
15కంపెనీల ప్రతినిధులు రాక
ఐటీ హబ్‌లో ఉద్యోగాల కల్పనకు తొలిదశలో 15కంపెనీలు రాగా వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ మొదలుపెట్టా రు. ఈ నియామక ప్రక్రియలో ఐటీ కంపెనీలు మూడంచెల విధానాన్ని అమలు చేయనున్నారు. తొలిదశలో సుమారుగా 200మందిని ఎంపిక చేయనున్నారు.
ఉద్యోగాలకు ఎక్కువగా బీటెక్, ఎంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన యువత మేళాలో పాల్గొని పోటీ పడ్డారు. ఉద్యోగార్థులకు ఇబ్బందులు లేకుండా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా యత్రాంగం భోజనంతోపాటు మౌలిక వసతులు కల్పించారు.
చదవండి: Job Opportunity: ఉపాధి కల్పించేందుకు మరో జాబ్ మేళా
కమ్యూనికేషన్స్, టెక్నాలజీపై ఉచిత శిక్షణ
ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో జాబ్‌మేళాకు వేలాదిగా యువత తరలిరావడం సంతోషంగా ఉందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి యువతతో అన్నారు.
జాబ్ రానివారు నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు. బీటెక్ చదివిన యువతకు టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌పై ఉచిత శిక్షణ ఇచ్చి ఐటీ రంగంలో ఉన్నతమైన ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తామన్నారు.
చదవండి: Free Training: ఇంజనీరింగ్, టెక్నాలజీలో ఉచిత శిక్షణ