Skip to main content

Free Training: ఇంజనీరింగ్‌, టెక్నాలజీలో ఉచిత శిక్షణ

Free Training, OBC and SC Unemployed Youth Training Program,Central Petrochemicals Engineering and Technology (CPET) in Vijayawada
Free Training

గుంటూరు ఎడ్యుకేషన్‌: విజయవాడలోని కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో ఓబీసీ, ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ సోమవారం ఓప్రకటనలో తెలిపారు.

జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) సంయుక్తంగా టెన్త్‌లో ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల లోపు వయపు కలిగిన నిరుద్యోగ యువతకు పాలిమర్స్‌ టెక్నాలజీలో మెషీన్‌ ఆపరేటర్‌–ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌, మెషీన్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌–ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ కోర్సులో 3–6 నెలల పాటు ఉచిత శిక్షణ కల్పిస్తామని వివరించారు.

అనంతపురం, హైదరాబాద్‌ బెంగుళూరు, హోసూరు, చైన్నె తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు చూపిస్తా మని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు, ట్రైనింగ్‌ కిట్‌, యూనిఫాం, సేఫ్టీ షూస్‌ను సీ పెట్‌ అందజేస్తుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ప్రతినిధి బాణావతు అంజినాయక్‌ను 7893586494 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

Published date : 27 Sep 2023 09:50AM

Photo Stories