Job Opportunity: ఉపాధి కల్పించేందుకు మరో జాబ్ మేళా
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో ఈనెల 29న శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారులు సీహెచ్ సుబ్బిరెడ్డి(క్లరికల్), కె.శాంతి(టెక్నికల్) తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, వరుణ్ మోటార్స్, సుస్వాదీప్ ఆగ్రో సర్వీసెస్, పైనీర్ ఎలాస్టిక్, రవి రేస్(ఇండియన్ ఆయిల్ డీలర్స్), పేటీఎం సర్వీసెస్, రిలయన్స్ ట్రెండ్స్, ముత్తూట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో 616 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు.
Sports for Students: క్రీడా జీవితంలో విద్యార్థుల సత్తా చాటాలి
ఈ కంపెనీల్లో ఫ్లోర్ అసోసియేట్, వ్యాన్ డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేటింగ్ కాల్ అసిస్టెంట్, ఆపరేటర్, క్యాషియర్, పిక్కర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్స్, వేర్‌హౌస్ అసోసియేట్స్, ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్, టీం లీడర్స్, అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆయా ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐటీఐ, బీటెక్, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన 18–45 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు https:// www. ncs. gov. in/ లో పేర్లు నమోదు చేసుకుని.. జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.