Skip to main content

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

లేపాక్షి: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ల్యాండ్‌ సర్వేయర్‌, ఎలక్ట్రిషియన్‌, ప్లంబింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
Free training for unemployed youth

అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు ఉండాలని, ల్యాండ్‌ సర్వేయర్‌ శిక్షణకు ఇంటర్‌, ఎలక్ట్రీషియన్‌ కోర్సుకు 10వ‌ తరగతి పూర్తిచేసిన వారు అర్హులని హిందూపురం ఇన్‌స్టిట్యూట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోవిందరాజులు తెలిపారు. ఈమేరకు డిసెంబ‌ర్ 11న‌ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

చదవండి: Free training for group exams: సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ

ఆసక్తి కల్గిన వారు డిసెంబ‌ర్ 13వ తేదీ లోపు ఆధార్‌, రేషన్‌కార్డు జిరాక్స్‌లు, అర్హత పత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హిందూపురం ముక్కడిపేటలోని ఎన్‌ఏసీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9052901657, 9110550779 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 13 Dec 2023 12:32PM

Photo Stories