Google పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్‌ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు.
ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు.
చదవండి: Google Meet Call: ఊడిన ఉద్యోగాలు.. రెండు నిమిషాల్లో 200 మందికి గుడ్‌బై చెప్పిన కంపెనీ..!
భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు.
తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్‌తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్ట్ చేశారు.