Jobs: 66 పరిశ్రమలకు 11,981 మంది నిపుణులు అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను మ్యాపింగ్ చేసి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలవారీగా మానవ వనరుల వివరాలను సేకరించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కొన్ని పరిశ్రమలు ఆయా సంస్థల్లోనే శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు వివరించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చదవండి:
‘మెషిన్ లెర్నింగ్’పై స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో జట్టు కట్టిన టెక్నాలజీ దిగ్గజం?
అదానీ పోర్టులో భారీ అవకాశాలు
ఒక్క నెల్లూరు జిల్లాలోనే పోర్టులు, లాజిస్టిక్ రంగంలో ఏకంగా 5,650 మంది మానవ వనరుల అవసరం ఉన్నట్లు అదాని పోర్టు తెలియచేయడమే కాకుండా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కర్నూలులో రాంకో సిమెంట్, వైఎస్‌ఆర్ కడపలో దాల్మియా సిమెంట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
జిల్లా |
రంగం |
కోర్సుల సంఖ్య |
మానవ వనరుల అవసరం |
నెల్లూరు |
పోర్టు లాజిస్టిక్స్ |
5 |
5,650 |
ప్రకాశం |
టెక్స్‌టైల్ |
6 |
375 |
అనంతపురం |
ఎలక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ క్యాపిటల్ గూడ్స్ ఐరన్ అండ్ స్టీల్ లైఫ్ సైన్సెస్ |
9 |
97 |
శ్రీకాకుళం |
ఫార్మా, గ్రానైట్, జీడిపప్పు |
9 |
85 |
విశాఖపట్నం |
ఇంజనీరింగ్, ఫార్మా |
3 |
370 |
తూర్పు గోదావరి |
హైడ్రోకార్బన్స్, కాగిత పరిశ్రమ ఆక్వా ఫుడ్ ప్రోసెసింగ్, రైస్‌మిల్స్ రసాయనాలు, పెట్రోకెమికల్స్ కొబ్బరీపీచు, కొబ్బరి ఉత్పత్తులు రీసైక్లింగ్ పేపర్ |
10 |
310 |
గుంటూరు |
ప్రింటింగ్, టెక్స్‌టైల్స్ ఆక్వా ప్రోసెసింగ్, సిమెంట్ |
4 |
630 |
వైఎస్‌ఆర్ కడప |
నిర్మాణ రంగ కార్యకలాపాలు విద్యుత్ పంపిణీ, ట్రాన్స్ ఫార్మర్స్ ఫుడ్ ప్రోసెసింగ్ |
10 |
400 |
కర్నూలు |
సిమెంట్ తయారీ |
4 |
65 |
విజయనగరం |
ఫెర్రోఅల్లాయిస్ |
6 |
40 |
చిత్తూరు |
ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ |
8 |
930 |
పశ్చిమగోదావరి |
ఆక్వా, టెక్స్‌టైల్, మైనింగ్ |
16 |
639 |
కృష్ణా |
టెక్స్‌టైల్,ఆటోమొబైల్, ఫార్మా జెమ్ అండ్ ఇండస్ట్రీ |
14 |
2390 |
తొలిదశలో 11,981 మంది అవసరం
జిల్లాలవారీగా సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది 11,981 మంది నిపుణులైన మానవ వనరులు అవసరమని వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 23 రంగాలకు చెందిన 66 పరిశ్రమలకు సంబంధించి 48 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. శిక్షణ అనంతరం అదే సంస్థలో ఉద్యోగంలో చేరేలా అవకాశం కల్పిస్తున్నారు.