Skip to main content

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో జట్టు కట్టిన టెక్నాలజీ దిగ్గజం?

గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్‌ నైపుణ్యం కల్పించేందుకు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.
Current Affairs
ఈ ఒప్పందంలో భాగంగా 10 నెలల్లో దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది మహిళలకు డిజిటల్‌ నైపుణ్యం కల్పిస్తారు. డిజిటల్‌ అక్షరాస్యత, ఉపాధికి అవసరమైన నైపుణ్యం పెంపు, స్వయం ఉపాధి, సమాచార నైపుణ్యం వంటి అంశాల్లో 70 గంటలకుపైగా కోర్సు కంటెంట్‌ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ కమ్యూనిటీ ట్రైనింగ్‌ వేదికగా ఆన్‌లైన్‌లో లైవ్‌ క్లాసులు నిర్వహిస్తారు. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 20,000 మంది యువతులను ఎంపిక చేసి ఎస్‌ఎస్‌డీసీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.

క్విక్ రివ్వూ :

ఏమిటి : నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌
ఎందుకు :గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్‌ నైపుణ్యం కల్పించేందుకు
Published date : 29 Oct 2020 05:30PM

Photo Stories