IIIT Hyderabad and IHub-Data: ‘మెషిన్ లెర్నింగ్’పై స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు
‘ఆధునిక మెషిన్ లెర్నింగ్’పై స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సును రూపొందించారు. 36 వారాల పాటు ఆన్ లైన్ ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించే ఈ కోర్సుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. జనవరి 2022 నుంచి ఈ నూతన కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రీ–ఫైనల్, చివరి ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును డిజైన్ చేశారు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇతర అనుబంధ శాఖల స్ట్రీమ్‌ల నుంచి ప్రీ–ఫైనల్, చివరి ఏడాది చదివే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్సుకు అన్ని పన్నులతో కలిపి రూ.10వేలు వ్యయమవుతుంది. డిసెంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం https://ihub-data.iiit.ac.in చూడొచ్చు.
చదవండి:
Tech Skills: పైథాన్.. కొలువుల కొండ!