Cyber Theft Awareness: పార్ట్‌టైం జాబ్ పేరుతో రూ.91,991 స్వాహా
అనిల్‌కుమార్‌కు సైబర్‌నేరగాళ్లు ఫిబ్రవరి 3న టెలిగ్రామ్‌లో పార్ట్‌టైం జాబ్ ఉందని ఓ లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా సంప్రదించగా సైబర్ నేరగాళ్లు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాలని సూచించడంతో వారికి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలాగే సైబర్ నేరగాళ్లు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.91,991 వారి ఖాతాలోకి బదిలీ చేయించుకుని మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: Stock Market Frauds: యువత అలెర్టుగా ఉండాలి... సోషల్ మీడియాలో ‘ట్రెండింగ్ మోసం’ ఇదే!
రహ్మత్‌పురలో..
జగిత్యాల పట్టణంలోని రహ్మత్‌పురకు చెందిన ఎండీ.షాబుద్దీన్‌ను సైబర్ నేరగాళ్లు ప్యాకింగ్ పేరుతో మోసం చేశారు. షాబుద్దీన్ ఫోన్‌కు కొద్ది రోజుల క్రితం నటరాజ్ పెన్సిల్ ప్యాకింగ్ పేరుతో ఓ యాడ్ రాగా.. ఆ నంబరును సంప్రదించాడు. మొదట కొంత నగదు చెల్లించాలని చెప్పడంతో ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా మూడు దఫాల్లో రూ.6,950 చెల్లించాడు. తిరిగి ఫోన్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.