Job Fair: యువత కోసం ప్రతి ఏటా జాబ్ మేళా
బాన్సువాడలో నవంబర్ 15న బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన యువతతో యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడలో రెండు సార్లు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కోచింగ్‌కు హాజరైన చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.
సెప్టెంబర్‌లో నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించగా అందులో 1,411 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పోచారం శ్రీనివాస్‌రెడ్డికే దక్కిందన్నారు.
శీనన్నకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి పక్షాల పార్టీలకు చెందిన అభ్యర్థులను వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించాలన్నారు.
అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయులు పోచారం రవీందర్‌రెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డిలు స్టేజీపై డ్యాన్సులు చేసి యువకులను ఉర్రూతలూగించారు. నాయకులు ప్రశాంత్, యునుస్, శశికాంత్, భాను, ద్రోణవల్లి సతీష్, అంజిరెడ్డి, జంగం గంగాధర్, మోహన్ నాయక్, పాత బాలకృష్ణ, గోపాల్‌రెడ్డి, పిట్ల శ్రీధర్, తదితరులు ఉన్నారు.