Skip to main content

ఏఎఫ్‌యూలో రెండో విడత ప్రవేశాలు

వెఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలో నూతనంగా ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో 2021–22కు సంబంధించి రెండో విడత ప్రవేశాల ప్రక్రియను అక్టోబర్‌ 25న నిర్వహించనున్నట్లు ఆర్ట్‌ అండ్‌ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ కన్వీనర్, రిజిస్ట్రార్‌ ఆచార్య సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
ఏఎఫ్‌యూలో రెండో విడత ప్రవేశాలు
ఏఎఫ్‌యూలో రెండో విడత ప్రవేశాలు

బీఎఫ్‌ఏ పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ఆర్ట్‌ హిస్టరీ, ఇంటీరియర్‌ డిజైన్, యానిమేషన్, అప్లయిడ్‌ ఆర్ట్, శిల్పం కోర్సుల్లో ప్రవేశానికి తొలి విడతలో హాజరు కాలేని విద్యార్థుల సౌకర్యార్థం రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొందరు గైర్హాజరు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హత కలిగిన వారందరూ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత సర్టిఫికెట్స్‌ ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్‌ ప్రతులు, 6 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 9866587635, 9985588105 సంప్రదించవచ్చని సూచించారు.

చదవండి: 

Inter: ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి

EAPCET: ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ సమాచారం..

Published date : 22 Oct 2021 01:51PM

Photo Stories