Skip to main content

KNRUHS: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

Web Counseling for MBBS Convenor Quota Seats
Web Counseling for MBBS Convenor Quota Seats

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళా శాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు సోమవారం సాయంత్రం నుంచి వెబ్‌ కౌన్సె లింగ్‌ ప్రారంభమైంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌ సైట్లో పొందుపరిచారని కాళోజీ నారా యణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రక టనలో పేర్కొంది. వెబ్‌ ఆప్షన్లు సోమవారం సాయంత్రం 6 గంటలనుంచి ప్రారంభం కాగా 26 మధ్యాహ్నం 1గంటవరకు ఆప్షన్లు ఇచ్చు కునేందుకు అవకాశం కల్పించింది. యూని వర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితా లోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సె లింగ్‌లో పాల్గొనవచ్చని వెల్లడించింది. మరిన్ని వివరాలకు  www.knruhs.telangana. gov.inలో చూడాలని కోరింది. 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 26 Apr 2022 12:59PM

Photo Stories