VOAకు ఉద్యోగ భద్రత కల్పించాలి
Sakshi Education
ఆసిఫాబాద్‌అర్బన్: ఐకేపీ పరిధిలో విధులు నిర్వర్తి స్తున్న వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వివి ధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో బుధవా రం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలన్నారు. రూ.10లక్షల సాధారణ బీమా, ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామ సంఘానికి పక్కా భవనాన్ని నిర్మించడంతోపాటు సమస్యలు ప రిష్కరించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీ వంగా తీర్మానించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, వీవోఏల సంఘం జి ల్లా అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు సునీత, రమ, రాజేందర్, జాడిబాబు తదితరులు పాల్గొన్నారు.
Also read: కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
Published date : 13 Apr 2023 08:17PM