కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో దూర విద్య పీజీ కోర్సుల ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పీజీ కోర్సుల పరీక్షల్లో యూనివర్సిటీ పరిధిలో వివిధ పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ.. 26 మంది విద్యార్థులు స్క్వాడ్లకు పట్టుబడి డీబార్ అయ్యారు. హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, ఉమెన్స్ పీజీ కళాశాలల పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్, దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ నరేందర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈనెల 13 నుంచి దూరవిద్య పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
తొలి రోజు 26 మంది విద్యార్థుల డీబార్
Published date : 13 Apr 2023 07:37PM