Skip to main content

ఒకేరోజు 2,500 మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు

దేశంలోని యూఎస్‌ కాన్సులేట్లలో జూన్‌ 7న 2,500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూలు చేసినట్టు యూఎస్‌ ఎంబసీ వెల్లడించింది.
Visa interviews for 2500 students in a single day
ఒకేరోజు 2,500 మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు

స్టూడెంట్‌ వీసా ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో తమ అధికారులు భారత విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు హైదరాబాద్‌ కాన్సులేట్‌ తెలిపింది. ఈ ఇంటర్వ్యూల్లో వీసాలు పొందిన విద్యార్థులకు చార్జ్‌ డీ అఫైర్స్‌ పాట్రీషియా లాసినా, కాన్సుల్‌ జనరల్స్‌ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ అమెరికా–ఇండియా సంబంధాలను విస్తృతం చేయాలని చార్జ్‌ డీ లాసినా ఆకాంక్షించారు. ఇప్పటికే అమెరికాఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు లాసినా గుర్తుచేశారు. అమెరికాలో ఉన్నత విద్య నసభ్యసిస్తున్న వారిలో భారతీయ విద్యార్థుల వాటా 20% ఉంటుందని, సంఖ్యా పరంగా 2 లక్షల మందికిపైగానే ఉన్నారని కాన్సులేట్‌ పేర్కొంది.

చదవండి: 

Presidential Advisory Commission: అమెరికా గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్‌... ఇన్ని నెల్లలో పూర్తి చేయాలి..

వర్క్‌పర్మిట్లపై యూఎస్‌ కీలక నిర్ణయం

Published date : 08 Jun 2022 01:47PM

Photo Stories