Satavahana University: అక్రమాలపై విజిలెన్స్!
Sakshi Education
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన వర్సిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. అయితే వర్సిటీ బాధ్యులు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని.. వివరాలన్నీ ఇవ్వాల్సిందేని విజిలెన్స్ అధికారులు మరోసారి వర్సిటీ ఆఫీసర్లకు లేఖ రాయనున్నట్లు తెలిసింది.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, ఏడు ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీ ఉన్నాయి. అయితే వర్సిటీలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈఏడాది జూన్ 18న కొందరు హైదరాబాద్‌లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
చదవండి: Jobs: సిమ్స్‌లో నేటినుంచి ఇంటర్వ్యూలు
సరిగ్గా నెలరోజుల తర్వాత ఆ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలున్న దానిని పరిశిలించి అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులో అభివృద్ధి, ఆడిటింగ్, సివిల్, రిక్రూట్‌మెంట్ తదితర అంశాలపై అనేక ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు అంశాల వారీగా నివేదిక ఇవ్వాలని వర్సిటీ అధికారులను కోరుతూ లేఖ రాశారు.
అరకొర నివేదిక..
- వర్సిటీ అధికారులు విజిలెన్స్ ప్రశ్నావళిని పరిశీలించి సమాధానాలు ఇచ్చారు. అన్నింటిని కలిపి నివేదిక రూపంలో
- అందజేశారు. వీటిని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు అరకొర సమాధానాలు ఇచ్చినట్లు గుర్తించినట్లు తెలిసింది. వాస్తవానికి వర్సిటీలో జరిగిన కొలువులు, పేపర్ వాల్యుయేషన్, నియామకాలు, పదోన్నతులు, వ్యయాలకు
- సంబంధించిన కంప్లయింట్లకు, వర్సిటీ అధికారుల
- సమాధానాలు సరిపోలడం లేదని సమాచారం. దీంతో
- విజిలెన్స్ అధికారులు మరోసారి వర్సిటీ అధికారులకు
- మరోసారి లేఖ రాయాలని నిర్ణయించినట్లు
- విశ్వసనీయ సమాచారం
Published date : 16 Aug 2024 01:53PM