HCU: ఎంబీఏ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరీ తేదీ ఇదే..
Sakshi Education
రాయదుర్గం: Hyderabad Central Universityలో 2023–25 బ్యాచ్‌లో చేరే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
ఎంబీఏ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరీ తేదీ ఇదే..
దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లోని ఎంబీఏ కోర్సు 2023–25 కోసం దరఖాస్తులను ఆహా్వనిస్తూ తప్పనిసరిగా 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలని పేర్కొన్నారు.
కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)–2022 స్కోర్ కలిగి ఉంటూ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీఏ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింకులతో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్: 040–23135000.