ఒకేషనల్ కాలేజీకి ఓకే.. మూడు కోర్సులు.. 90 సీట్లతో ఈ ఏడాదే ప్రారంభం
ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకేషనల్ కాలేజీని అందుబాటులోకి తెస్తోంది. తార్నాకలోని రవాణా సంస్థ ఆసుపత్రికి అనుబంధంగా దీనిని ఏర్పాటు చేస్తోంది. తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్న విషయం తెలిసిందే. 200 పడకల ఈ ఆసుపత్రిలో ఇంతకాలం కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే చికిత్స చేసేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా విస్తరించనున్నారు. ఈ క్రమంలో దానికి అనుబంధంగా ఒకేషనల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. ఒకేషనల్ కళాశాలలో తొలుత Medical Laboratory Technology(MLT), Physiotherapy(PT), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులను ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల వ్యవది ఉండే ఈ కోర్సులకు 30 చొప్పున సీట్లను కేటాయించారు. ఇందులో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తిగా యువతులకే కాగా, మిగతా రెండింటిని కో–ఎడ్యుకేషన్ క్లాసెస్‌గానే నిర్వహించనున్నారు.
చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ..
దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరటానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలోనే ఈ కళాశాల కొనసాగుతుంది. ఇటీవల ఇక్కడ ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం 5 సీట్లు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఒకేషనల్ కాలేజీలో మాత్రం అలాంటి వెసులుబాటు కల్పించలేదు.
చదవండి: ‘కారుణ్యం’పై కనికరమే కానీ..!
ఫీజు రూ.15 వేల నుంచి రూ.20 వేలు
ఈ కోర్సులకు ఇంకా ఫీజులను నిర్ధారించలేదు. కానీ, ఫీజులు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. నర్సింగ్ కాలేజీ కోసం అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించగా, ఒకేషనల్ కాలేజీకి మాత్రం ఆ వెసులుబాటు లేదు.
చదవండి: కెరీర్ గైడెన్స్..ఫిజియోథెరపీ
ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి
ఒకేషనల్ కాలేజీని ఈ విద్యాసంవత్సరమే ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్న అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 73828 35579, 95736 37594 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే నేరుగా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చి సంప్రదించవచ్చు.
– శైలజ, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్