Oceanography: ‘ఓషనోగ్రఫీ’ కోర్సులపై శిక్షణ
Sakshi Education
ఆపరేషనల్ ఓషనోగ్రఫీకి సంబంధించి వివిధ కోర్సులపై ఉత్తమ శిక్షణ సేవలందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సరీ్వసెస్ (ఇన్కాయిస్), ఇండియన్ నేవీ పరస్పర అవగాహన కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా ఇన్కాయిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ ద్వారా వివిధ కోర్సులపై ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ నేవీ సహకారం అందించనుంది. ఈ మేరకు ఇన్కాయిస్ డైరెక్టర్ టి. శ్రీనివాసకుమార్, డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెటీయోరాలజీ కమోడోర్ ఏఏ అభ్యంకర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నావల్ ఆపరేష¯Œ్స డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ కమోడోర్ జి.రాంబాబు, సైంటిస్ట్ అండ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ టీవీఎస్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 10 May 2022 12:51PM