AAPAR : విద్యార్థికి అపార్ అత్యంత కీలకం..!
అమలాపురం రూరల్: అపార్ ఐడీ నమోదు విద్యార్థికి అత్యంత కీలకమని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎక్కడ చదివింది సులభంగా తెలుస్తుందని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి ఉచిత ఇసుక పాలసీ, ధాన్యం సేకరణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు, రీ సర్వే సరిహద్దు రాళ్ల పై పేర్ల తొలగింపు అర్జీల పరిష్కారం, నరేగా అనుసంధానంతో పల్లె పండగ కార్యక్రమాలు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని సూంచారు.
Constitution of India: నేడు రాజ్యాంగ దినోత్సవం.. దీని నేపథ్యం ఇదే..
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో అపార్ నమోదు నూరు శాతం పూర్తి చేయాలన్నారు అపార్ ఐడీలు జనరేట్ చేసేందుకు అవసరమైన ఆధార్, జనన తేదీ, స్కూల్ సర్టిఫికెట్ల మధ్య వ్యత్యాసాలను సరిదిద్దాలన్నారు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 83శాతం పూర్తయిందని మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 28, 29 తేదీలలో తుపాను మూలంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం కోతలు నిలుపుదల చేయాలని సూచించారు. జేసీ టి.నిషాంతి, డీఆర్‌ఓ మదనమోహనరావు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)