Skip to main content

Traditional Course: ట్రెండ్‌ మారిన సాధారణ డిగ్రీ.. నచ్చిన కాంబినేషన్‌తో మెచ్చిన డిగ్రీ

Traditional courses
Traditional courses

డిగ్రీ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌తో సమానంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా కోర్సులు ప్రవేశపెడుతున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రకరకాల ఇతర ఆకర్షణీయమైన కొత్త కాంబినేషన్లు జోడిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ తరహా కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఇదే ఒరవడి కన్పిస్తోంది. 4 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఉంటే, 2.5 లక్షల మంది వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఇందులో 80 శాతం మంది మంచి కాంబినేషన్‌ ఉన్న డిగ్రీ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం లభించడానికి అవకాశం ఉన్న కోర్సులు ఏయే కాలేజీల్లో ఉన్నాయో వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు బహుళ జాతి సంస్థలు మొదట్నుంచే శిక్షణ ఇస్తుండటం కూడా విద్యార్థులకు కలిసొస్తోంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని కంపెనీలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ఇలాంటి డిగ్రీలకే ప్రాధాన్యమిస్తున్నారు.

Also read: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

బీఏలో 68 .. బీఎస్సీలో 73..!
బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో పదేళ్ళ క్రితం వరకు గరిష్టంగా పది కాంబినేషన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం పరిశోధన వైపు వెళ్ళే వాళ్ళు మాత్రమే సంప్రదాయ కోర్సుల్లో చేరుతున్నారు. ఐటీ సామర్ధ్యంతో కూడిన డిగ్రీ తర్వాత మంచి వేతనంతో బహుళజాతి కంపెనీల్లోకి వెళ్లాలని భావించేవారు ఆ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు ఒక్క బీఏలోనే 68 రకాల కోర్సులు రావడం గమనార్హం. బీఎస్సీలో 73 రకాలు, బీకాంలో 13 రకాల కాంబినేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, బ్యాచులర్‌ ఆఫ్‌ ఒకేషన్‌ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ– టూరిజం పరిపాలన) వంటి కోర్సులు కొనసాగుతున్నాయి. బీఏ, బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా అప్లికేషన్‌ కోర్సులు తీసుకొచ్చారు. బీఎస్సీ గణితం, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ వంటి కాంబినేషన్‌ కోర్సులు మార్కెట్‌ అవసరాలు తీర్చేలా ఉన్నాయి. బీఎస్సీ అభ్యర్థి సైతం అడ్మినిస్ట్రేషన్‌ను ఒక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చంటే డిగ్రీ కోర్సుల్లో ఏ విధంగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయో అర్ధమవుతుంది.

Also read: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

బీఏలో ఇలా..
– కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌ అప్లికేషన్లు
– చరిత్ర, కంప్యూటర్‌ అప్లికేషన్లు టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
– చరిత్ర, రాజకీయ శాస్త్రం– టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌ అప్లికేషన్లు
– అడ్వరై్టజింగ్‌– సేల్స్‌ ప్రమోషన్‌– సేల్స్‌ మేనేజ్‌మెంట్‌
– బ్యాంకింగ్‌ – ఇన్సూరెన్స్‌– కంప్యూటర్‌ అప్లికేష¯న్స్‌
– ఈ–కామర్స్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
– ఫారిన్‌ ట్రేడ్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ప్రొసీజర్స్‌ 

Also read: Startup School India (SSI): కలల బడిలోకి...

బీకామ్‌..

  • స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 
  • డేటా ఎనాలసిస్, కంప్యూటర్‌ మేనేజ్‌మెంట్‌ బీకామ్‌ హానర్స్‌

Also read: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

బీఎస్సీ..
– డేటా సైన్స్‌ – భౌతిక శాస్త్రం – రసాయన శాస్త్రం
– అడ్మినిస్ట్రేషన్‌ – భౌతిక శాస్త్రం – రసాయన శాస్త్రం
– అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌– వృçక్ష శాస్త్రం, రసాయనశాస్త్రం
– బయోటెక్నాలజీ– రసాయన శాస్త్రం – కంప్యూటర్‌ అప్లికేషన్లు
– బయోటెక్నాలజీ – రసాయన శాస్త్రం– ఫోరెన్సిక్‌ సైన్స్‌
– బయోటెక్నాలజీ – జంతుశాస్త్రం –కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
– బయోటెక్నాలజీ – మైక్రోబయాలజీ – కంప్యూటర్‌ అప్లికేష¯Œన్స్‌
– వృక్షశాస్త్రం – ఫారెస్ట్రీ – రసాయనశాస్త్రం
– వృక్షశాస్త్రం – రసాయనశాస్త్రం– ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌
– ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ – జంతుశాస్త్రం – రసాయన శాస్త్రం
– మైక్రోబయాలజీ – అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ 
– సెరీ కల్చర్‌ – వృక్షశాస్త్రం – జంతుశాస్త్రం
– న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌– జుంతుశాస్త్రం –రసాయన శాస్త్రం

Also read: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

కాంబినేషన్‌ గ్రూపులనే అడుగుతున్నారు
గత కొన్నేళ్ళుగా డిగ్రీ విద్యార్థులు సాంకేతిక, మార్కెట్‌ అవసరాలు తీర్చగలిగిన కాంబినేషన్‌ కోర్సులనే ఇష్టపడుతున్నారు. దీనికి అనుగుణంగానే కాలేజీలూ మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఐటీ దిగ్గజ కంపెనీలతో విద్యార్థులకు ఎక్కువ శాతం ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వారిని కాంబినేషన్‌ కోర్సులతో సిద్ధం చేస్తున్నాం. 
– ఎకల్దేవి పరమేశ్వర్‌ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

Also read: Career Opportunities with Internship: ఇంటర్న్‌షిప్‌.. కెరీర్‌కు ధీమా!

డేటా సైన్స్‌తో దూసుకుపోతున్నా.. 
నేను బీఎస్సీ డేటా సైన్స్‌ రెండో సంవత్సరంలో ఉన్నా. దీనితో పాటు కొన్ని కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుంటున్నా. ఇప్పటికే ఇంజనీరింగ్‌ విద్య కన్నా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించినట్లు భావిస్తున్నా. పైగా మాకు ఐటీ కంపెనీలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. డిగ్రీ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ దొరుకుతుందనే నమ్మకం ఉంది.
– నవీన్‌ (బీఎస్సీ డేటాసైన్స్‌ విద్యార్థి, హైదరాబాద్‌)
 

Published date : 26 Jul 2022 03:47PM

Photo Stories