TOEFL: టోఫెల్ ప్రింటెడ్ పేపర్లు
నవంబర్ 28 నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు. ఈసారి టోఫెల్ పరీక్షలకు కూడా ప్రింటెడ్ ప్రశ్నపత్రాలు సరఫరా చేయడం విశేషం.
1 నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బైలింగ్విష్ విధానంలో, పదో తరగతి విద్యార్థులకు మీడియం వారీగా ప్రశ్నపత్రాలు అందజేస్తారు. ఎస్‌ఏ–1 పరీక్షలకు విద్యాశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
ప్రశ్నపత్రాలపై ప్రతి జిల్లాకు సీక్రెట్ క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. పేపర్లను ఎవరైనా లీక్ చేసినా, ఏ పాఠశాల నుంచి లీక్ అయినా విషయం క్షణాల్లో బయటపడే అవకాశం ఉండేలా చర్యలు చేపట్టారు.
చదవండి: Australia Says No To TOEFL: ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నారా... ఇక టోఫెల్ కి చెక్!
పరీక్షల సమయం ఇలా...
- ● 1–5 తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు
- ● 6, 8, 10 తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ, 7, 9 తరగతులకు మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
మొదటిసారి టోఫెల్ ప్రింటెడ్ పేపర్లు..
ఇంగ్లిష్‌లో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రభుత్వం టోఫెల్ విద్యను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు టోఫెల్ పరీక్షను ఐఎఫ్‌పీ, స్మార్ట్ టీవీలు ఉన్న పాఠశాలల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించగా, తొలిసారి ప్రింటెడ్ పేపర్లను ఎస్‌సీఈఆర్‌టీ సరఫరా చేసింది. సాధారణ పరీక్షల మాదిరిగానే ఇకపై టోఫెల్ పరీక్షను ప్రింటెడ్ పేపర్లలో విద్యార్థులు రాయనున్నారు.
మండల కేంద్రాలకు పేపర్ల సరఫరా..
జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) ద్వారానే ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పరీక్ష పేపర్లను డీసీఈబీ ద్వారా మండల విద్యాకేంద్రాలకు చేరవేశారు. వీటికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు కస్టోడియన్‌లుగా వ్యవహరిస్తారు. పది పబ్లిక్ పరీక్ష పేపర్ల మాదిరిగానే పరీక్షల తేదీల వారీగా ప్రశ్న పత్రాలను ట్రంకు బాక్సుల్లో భద్రపరిచారు.
30,893 మంది హైస్కూల్ విద్యార్థులు:
సమ్మెటివ్–1 పరీక్షను 6–10వ తరగతుల వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 85,227, ప్త్రెవేట్ పాఠశాలల్లో 59,426 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 1–5 తరగతుల్లో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 99,200 మంది విద్యార్థులు ఉన్నారు.
Tags
- TOEFL Printed Papers
- Summative Assessment Tests
- SCERT
- Andhra Pradesh
- SA I Exams
- Department of Education
- SCERT updates
- Basetawaripet news
- Summative exams schedule
- Learning assessment
- educational news
- Exam Dates
- Education Updates
- student performance
- Assessment announcement
- Sakshi Education Latest News