New Colleges: తెలంగాణలో మరో మూడు మత్స్య కళాశాలలు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు మత్స్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు వరంగల్, సిద్దిపేట, నల్లగొండప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి రిజర్వాయర్‌లో చేపపిల్లలను వదిలారు.
Published date : 22 Sep 2021 06:43PM