New Fisheries Technology: మత్స్యకారులతో సంప్రదింపులు.. కారణం?
సాక్షి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ తమిళనాడులో చేపల వనరులకు సంబంధించిన వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి ఐదు క్షేత్ర అధ్యయనాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చైన్నె హార్బర్ ప్రాంతంలో మత్స్యకారులతో మంగళవారం సంప్రదింపులు నిర్వహించింది. ఇందులో చైన్నె, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలకు చెందిన మత్స్యకారుల సహకార నిధులు, మత్స్య సంబంధిత పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
➤ Literature Competitions: విద్యార్థులకు సాహిత్య పోటీలు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకురాలు డాక్టర్ గీతా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షణ్ముకానందం కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సదుపాయాలపై వివరించారు. ఈ ప్రాంతంలోని రొయ్యల ఫారం నుంచి వెలువడే వ్యర్థ జలాల కాలుష్యాన్ని తగ్గించడానికి సంబందించిన సాంకేతికతను తెలియజేయడానికి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. చెంగల్పట్టు ప్రాంతంలో లోతట్టు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పారిశ్రామిక, వాణిజ్య అంశాలపై చర్చించారు.
➤ NAAS Exams for Students: విద్యార్థులకు నాస్ పరీక్షలు
చైన్నెలోని హార్బర్ ప్రాంతంలో సెంట్రల్ ఫిషరీష్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ శాఖను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా మత్స్యకార సంబంధిత సాంకేతిక శిక్షణను ఈ ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాల యువతకు సులభంగా అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో చైన్నె పోర్ట్ సభ్యుడు సతీష్ సీమ జాగరణ్ మాన్సిన్, ఉత్తర తమిళనాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ ఆర్ ఎస్ లేష్మన్ అధ్యక్షత వహించారు. ఇందులో సత్యమూర్తి, రామ్‌కుమార్ పాల్గొన్నారు.