Telangana Schools and Colleges Holidays : ఈ స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు.. ఎందుకంటే..?
ఎందుకంటే.. జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్ష టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు.. జూలై 1వ తేదీ (శనివారం) పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.
అలాగే తర్వాత రోజు ఆదివారం.. సాధారణంగా ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉన్న విషయం తెల్సిందే. దీంతో వరుసగా రెండు రోజులు పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ 'డే' గా విద్యాశాఖ ప్రకటించింది.
మొత్తం 9 లక్షల 50 వేలమంది..
రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్