Skip to main content

Foreign Education: విదేశీ విద్యానిధి పథకంలో వసూళ్ల పర్వం

సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకం అమల్లో వసూళ్ల పర్వానికిది నిదర్శనం. దరఖాస్తుల్లో ఎలాంటి తప్పి దాలు లేనప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన అధికారులు ముక్కుపిండి వసూళ్లకు తెగబడుతున్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు వేర్వేరు పేర్లతో ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనికింద అర్హత సాధించిన అభ్యర్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ప్రభుత్వం గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయా సంక్షేమ శాఖల నుంచి ఏటా సగటున వెయ్యి మంది లబ్ధి పొందుతున్నారు.
Foreign Education
విదేశీ విద్యానిధి పథకంలో వసూళ్ల పర్వం

అన్నీ ఉన్నా కొర్రీలే...

బ్యాచ్లర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి నిర్దేశించిన తొమ్మిది దేశాల్లో మాస్టర్డిగ్రీ లేదా ఎంఎస్ చేసేందుకు ఓవర్సీస్ విద్యానిధి కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, సరి్టఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సంబంధిత సంక్షేమ శాఖ ఒకరిద్దరు అధికారులను దరఖాస్తుదారు ఇంటికి పంపిస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఫీల్డ్ విజిట్కు వెళ్లిన అధికారులు అన్ని రకాలుగా పరిశీలన చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా దరఖాస్తు తదుపరి అంకానికి చేరుతుంది. నివేదికను అనుకూలంగా రాసేందుకు అధికారులు ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నప్పటికీ డబ్బులివ్వకుంటే కొర్రీలు పెట్టి, దరఖాస్తును తిరస్కరిస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో సాయం వస్తున్నందున ఎంతోకొంత ముట్టజెప్పేందుకే ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. దీనిపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా సంక్షేమశాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని ఎల్బీ నగర్కు చెందిన ఓ విద్యార్థి తల్లి ‘సాక్షి’తో అన్నారు.

విద్యానిధికి అర్హతలివే...

కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో 60 శాతం మార్కులు సాధించాలి. జీఆర్ఈ లేదా జీమ్యాట్లలో ఏదేని ఒక దాంట్లో అర్హత ఉండాలి. జీఆర్ఈలో కనీసం 260 మార్కులు లేదా జీమ్యాట్లో 500 మార్కులు రావాలి. అదేవిధంగా టోఫెల్లో 60 పాయింట్లు లేదా ఐఈఎల్టీఎస్లో 6.5 పాయింట్లు రావాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో పెద్దగా పోటీలేదు. బీసీ, ఈబీసీల్లో మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. దీంతో ఎక్కువ మార్కులు వచి్చన వారికి ప్రాధాన్యత ఇస్తూ అర్హతను నిర్ధారిస్తున్నారు.

రెండు విడతల్లో..

ఈ పథకం కింద అర్హత సాధిస్తే రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో ఇస్తుంది. ఎంఎస్ లేదా మాస్టర్ డిగ్రీ రెండేళ్ల కోర్సు. ఒక ఏడాది ఉత్తీర్ణత సాధించిన తర్వాత మొదటి విడత, రెండో ఏడాది కోర్సు పూర్తయ్యాక మిగిలిన మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తుంది. అమెరికా, యూకే, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలోని యూనివర్సిటీల్లో చదవొచ్చు.

చదవండి: 

Visa Interview: విజయం సాధించడం ఎలా..? మ‌ఖ్యంగా అడిగే ప్రశ్నలు ఏమిటి?

Foreign Education: విదేశీ విద్య ఉపకార వేతనాలు విడుదల చేయాలి

వీసా ఇంటర్వూలో డూస్‌ అండ్‌ డోంట్స్‌.. ఇలా అయితే ఓకే!

సరైన ప్రిపరేషన్‌ ఉంటే.. ఈ టెస్ట్‌ల్లో విజయం సాధించడం సులువే..

Published date : 17 Feb 2022 03:32PM

Photo Stories