Foreign Education: విదేశీ విద్య ఉపకార వేతనాలు విడుదల చేయాలి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ విద్య పథకంలో అర్హులకు ఉపకార వేతనాలను విడుదల చేయాలని కాపు సామాజికవర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి(శేషు)ని రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సెప్టెంబర్ 3న విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయించి తోడ్పాటును అందించాలని కోరారు. అడపా శేషు స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Published date : 04 Sep 2021 01:52PM