Skip to main content

సరైన ప్రిపరేషన్‌ ఉంటే.. ఈ టెస్ట్‌ల్లో విజయం సాధించడం సులువే..

ప్రీ–రిక్విజిట్‌ టెస్టులు లేదా స్టాండర్డ్‌ టెస్ట్‌లుగా పిలిచే ఈ పరీక్షల్లో మంచి స్కోర్‌ సాధించాలంటే.. సరైన ప్రిపరేషన్‌ ప్రణాళికను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెర్బల్‌ ఎబిలిటీ: జీమ్యాట్, జీఆర్‌ఈలలో ఎదురయ్యే వెర్బల్‌ ఎబిలిటీలో రాణించాలంటే.. కరెక్ట్‌ ఎక్స్‌ప్రెషన్, ఎఫెక్టివ్‌ ఎక్స్‌ప్రెషన్, ప్రాపర్‌ డిక్షన్‌లపై పట్టు సాధించాలి. వీటికోసం గ్రామర్, యాంటానిమ్స్, సినానిమ్స్‌లో నైపుణ్యం పొందాలి. అదే విధంగా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: అర్థమెటిక్, అల్‌జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీలో గట్టి పట్టుంటే.. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగంలో రాణించొచ్చు. జామెట్రీలో డయాగ్రమ్స్, గ్రాఫ్స్, బార్స్, సర్కిల్స్, లైన్‌ గ్రాఫ్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.

అనలిటికల్‌ రైటింగ్‌: వ్యాసాల(ఎస్సే)పై పట్టు సాధించడం ద్వారా అనలిటికల్‌ రైటింగ్‌ సెక్షన్‌లో బెస్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా అనాలజీస్, సెంటెన్స్‌ కంప్లీషన్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల్లోనూ నైపుణ్యం అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను చదవడం, ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానెళ్లను వీక్షించడం మేలు చేస్తుంది.

లాంగ్వేజ్‌ పరీక్షలు.. నైపుణ్యాలు

  • లాంగ్వేజ్‌ పరీక్షల పరంగా అభ్యర్థులు లిజనింగ్, రీడింగ్, రైటింగ్‌Š స్కిల్స్‌ మెరుగుపర్చుకోవాలి.
  • లిజనింగ్‌: ఈ విభాగంలో రాణించాలంటే.. ‘స్కిల్‌ డెవలపింగ్‌ వ్యూ’లో చదవాలి. స్టాండర్డ్‌ గ్రామర్‌ బుక్స్‌ కంటే వొకాబ్యులరీని పెంచే పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది.
  • రీడింగ్‌: రీడింగ్‌లో పరిజ్ఞానం పెంపొందించుకోవాలంటే.. క్రమం తప్పకుండా ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు చదవాలి. కేవలం ఇంగ్లిష్‌ సాహిత్యానికి పరిమితమైన అంశాలే కాకుండా.. అన్ని విభాగాలు (ఉదాహరణకు బిజినెస్, సైన్స్, ఆర్ట్స్‌) వాటిపై వచ్చే వ్యాసాలు చదవడం మేలు చేస్తుంది.
  • రైటింగ్‌: ఈ విభాగంలో మంచి స్కోరు పొందేందుకు మార్గం గ్రమటికల్‌ వొకాబ్యులరీనీ పెంపొందించుకోవాలి. ‘యాక్టివ్, ప్యాసివ్‌ వాయిస్‌’, ‘సబ్జెక్ట్‌ అండ్‌ వెర్బ్‌ అగ్రిమెంట్‌’, ‘కాంప్లెక్స్‌ సెంటెన్స్‌ ఫార్మేషన్‌’పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.

ఇంకా చ‌ద‌వండి: part 1: ఈ టెస్ట్‌లో స్టాండర్డ్‌ స్కోర్‌తో.. విదేశీ విద్యకు తొలి అడుగు!!

Published date : 05 Mar 2021 05:23PM

Photo Stories