ఇకపై ఇక్కడి యూనివర్సిటీల్లో అమ్మాయిలకు నో ఎంట్రీ
యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. తాలిబన్ల తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాబూల్‌లో అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకి దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు. యూనివర్సిటీల దగ్గర తాలిబన్ బలగాలు భారీగా మోహరించి అమ్మాయిలు రాకుండా అడ్డుకుంటున్నారు. 2021లో అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాక 2021, ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు మహిళలకు అండగా ఉంటామని కల్లగొల్లి కబుర్లు చెప్పారు.
చదవండి: Driving Licence: మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీపై నిషేధం విధించిన దేశం?
ఈ ఏడాదిన్నర కాలంలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో తాలిబన్లు మహిళల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకి గురి చేయడంతో ఎందరో కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నత విద్యకు అమ్మాయిల్ని దూరం చేయడంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అఫ్గాన్‌లో తాలిబన్లు మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. కాబూల్ యూనివర్సిటీ బయట అమ్మాయిలు ఏడుస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యాలు మనసుని పిండేస్తున్నాయి. అఫ్గాన్ మహిళల ఛిద్రమైపోతున్న బతుకు చిత్రం ఎలా ఉందో చూద్దాం.
చదవండి: Girls Education: బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు?
ఉద్యోగాలకూ మహిళలు గుడ్ బై
తాలిబన్లు అధికారంలోకి వచి్చన తర్వాత ప్రధానమంత్రి ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలు కొనసాగవచ్చునని భరోసా ఇచ్చారు. కానీ ఆ తర్వాత వారి వేతనాల్లో భారీగా కోత విధించారు. వందలాది మంది మహిళలు ఉద్యోగాలు వదులుకునే పరిస్థితుల్ని తెచ్చారు. మహిళలు నడిపే 3,500కి పైగా చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. కాబూల్‌లో 700 మంది మహిళా జర్నలిస్టులుంటే ఇప్పుడు కేవలం 100 మంది మాత్రమే పని చేస్తున్నారు. గతంలో దేశంలో 40 శాతం మంది మహిళా టీచర్లుంటే ఇప్పుడు అతి కొద్ది మాత్రమే ఉన్నారు.
చదవండి: మహిళలు ఇకపై ఇ యూనివర్సిటీలో చేరడానికి లేదా బోధించడానికి అనుమతి లేదు
45% బాలికలు డ్రాపవుట్
2021 సెపె్టంబర్ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు.