Girls Education: బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు?
అఫ్గానిస్తాన్‌లో బాలికా విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వం ఛాందసవాద వైఖరి ఏమాత్రం మారలేదు. ఆరో తరగతికి మించి బాలికలు విద్య అభ్యసించడానికి వీల్లేదని మార్చి 22న తాలిబాన్ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైన తొలిరోజే(మార్చి 23) పాఠశాల విద్యార్థినులు కొద్ది గంటల్లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. హఠాత్తుగా బాలికా విద్యపై ఆంక్షలు విధించడానికి గల కారణాలను విద్యాశాఖ అధికార ప్రతినిధి అజీజ్ అహ్మద్ రియాన్ వెల్లడించలేదు. బాలికలను శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామనేది తమ అభిమతం కాదని విదేశీ వ్యవహారాల ప్రతినిధి వహీదుల్లా హష్మీ చెప్పారు.
Russia-Ukraine War: యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్కేంద్రం పేరు?
చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం ఏ దేశంలో ఉంది?
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని కీలకమైన నూతన లేబొరేటరీని రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రేడియోధార్మిక వ్యర్థాల మెరుగైన నిర్వహణతో పాటు పలు కీలకాంశాల్లో ఈ ల్యాబ్‌ది కీలక పాత్ర అని ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ తెలిపింది. రష్యా దాడిలో నేలమట్టమైన ల్యాబ్‌ను 2015లో ఈయూ సహకారంతో నిర్మించారు.
Russia-Ukraine War: చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ సంవత్సరం జరిగింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాలికా విద్యపై ఆంక్షలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : తాలిబాన్ ప్రభుత్వం
ఎక్కడ : అఫ్గానిస్తాన్