Skip to main content

జ్యోతి సురేఖ విజయం స్ఫూర్తిదాయకం

పాఠశాలల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు.
జ్యోతి సురేఖను సన్మానిస్తున్న శాప్‌ ఎండీ ప్రభాకరరెడ్డి
జ్యోతి సురేఖను సన్మానిస్తున్న శాప్‌ ఎండీ ప్రభాకరరెడ్డి

అన్ని జిల్లాల్లో సీఎం కప్‌ పోటీల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించామని చెప్పారు. అమెరికాలో జరిగిన కాంపౌండ్‌ ఈవెంట్‌ ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్ షిప్‌లో జ్యోతి సురేఖ విజయం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని శాప్‌ ఎండీ కొనియాడారు. మిక్సిడ్, మహిళల డబుల్స్, సింగిల్స్‌ విభాగంలో కలిపి మూడు రజత పతకాలు సాధించి దేశానికి వన్నె తెచ్చారన్నారు. ఆమెను శాప్‌ కార్యాలయంలో అక్టోబర్‌ 12న ఘనంగా సత్కరించారు. అలాగే ఇటీవల తెలంగాణలో జరిగిన 37వ సబ్‌ జూనియర్‌ పురుషుల నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ టోరీ్నలో కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు క్రీడాకారులను కూడా సన్మానించారు. శాప్‌ అధికారులు పి.రామకృష్ణ, దుర్గాప్రసాద్, మహేష్, హ్యాండ్‌బాల్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Oct 2021 03:58PM

Photo Stories