Dr Anita: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
Sakshi Education
జైపూర్: విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు ఆహార పరిశుభ్రత పాటించాలని, ప్రతీ రోజు చేతులు శుభ్రం చేసుకోవాలని ఎన్‌సీవీబీడీసీ జిల్లా అధికారి డాక్టర్ అనిత తెలిపారు.
జైపూర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల వ సతి గృహాన్ని ఆగస్టు 20న సందర్శించారు. వస తి గృహంలో చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రపంచ దోమల ని వారణ దినం సందర్భంగా దోమల మూలంగా కలిగే వ్యాధులను వివరించారు.
చదవండి: Telangana: విద్యాప్రమాణాల ‘ఉన్నతి’ కోసం ఈ ప్రోగ్రాం
నిల్వచేసిన నీళ్లల్లో దోమలు ఆవాసాలు ఏర్పర్చుకుని అవి కుట్టడం వలన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, ఫైలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు దోమలు కుట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అల్‌బెండజోల్ మా త్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి అనిల్‌రావు పాల్గొన్నారు.
Published date : 21 Aug 2023 04:59PM