Sarath Chandra Reddy: విద్యార్థులకు అడవులపై అవగాహన
Sakshi Education
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న ఎకో పార్క్‌లో స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫారెస్టు రేంజర్ శరత్‌చంద్రరెడ్డి అడవులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న వాచ్ టవర్, వ్యూవ్ పాయింట్ వద్దకు విద్యార్థులను తీసుకెళ్లారు. ప్రకృతి సహజ సంపదలో అడవులు చాలా ముఖ్యమైనవని తెలిపారు. అడవుల వల్ల సమస్త జీవరాశికి కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుందన్నారు. అదేవిధంగా అనేక వన్యప్రాణులు ముఖ్యంగా సోమశిల అడవులలో పులి, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు తదితర జంతువులు నివసిస్తున్నాయని వివరించారు.
చదవండి: Singareni Jobs: సింగరేణి నియామకాల బాధ్యత ఈడీసీఐఎల్‌కు..
పులి జీవన విధానాన్ని, వాటి పంజా గుర్తుల ఆధారంగా మగ, ఆడ పులులను గుర్తించే విధానాన్ని, ప్రకృతి సమతుల్యతతో దాని పాత్ర గురించి, పులులను కాపాడుకోవడంలో మానవుల పాత్రపై వివరించారు. కార్యక్రమంలో ఫారెస్టు బీట్ అధికారి శ్యామ్ సుందర్ యాదవ్, అధ్యాపకులు రమేష్, కురుమయ్య, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 28 Mar 2024 04:49PM