Skip to main content

CP Vishnu S Warrier: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాల

ఖమ్మం : డిజిటల్‌ విద్యా బోధనతో శ్రీ కృష్ణప్రసాద్‌ మెమోరియల్‌ పోలీస్‌ వెల్ఫేర్‌ పాఠశాల దూసుకెళ్తోందని సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు.
Digital Education Advancements at Sri Krishnaprasad Memorial School   Sri Krishnaprasad Memorial Police Welfare School is similar to corporate schools

 పాఠశాలలో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాసులను స్కూల్‌ చైర్‌పర్సన్‌ హృదయ్‌ మీనన్‌తో కలిసి డిసెంబ‌ర్ 20న‌ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఈ స్కూల్‌ను బలోపే తం చేసినట్లు తెలిపారు.

చదవండి: Draupadi Murmu: విద్యార్థుల ప్రతిభతోనే.. దేశ గౌరవం ఇనుమడిస్తుంది

విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలపాలనే సంకల్పంతో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ వారు 10డిజిటల్‌ క్లాసులను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాలలో ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ కుమారస్వామి, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అధ్యక్షుడు భైయానుబాబు, రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆర్‌ఐ కామరాజు, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Published date : 21 Dec 2023 03:27PM

Photo Stories