TASK: రెండేళ్లలో పదివేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని పదివేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లభించనుంది. వీరిలో 70% మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి, మరో 30%మందిని పట్టణ ప్రాంతాల నుంచి నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు వర్చువల్ పద్ధతిలో, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భౌతిక తరగతుల ద్వారా శిక్షణ లభిస్తుంది.
చదవండి: అటు నైపుణ్యం... ఇటు ఉద్యోగం
తొలి బ్యాచ్‌కు అక్టోబర్ 11న శిక్షణ కార్యక్రమాన్ని టాస్క్ ప్రారంభించింది. హెచ్‌సీసీబీ, ఎన్‌ఐఐటీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నడుస్తున్న కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులకు త్వరలోనే సర్టిఫికెట్లు అందజేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హెచ్‌సీసీబీ తరహాలో కంపెనీలు టాస్క్‌తో భాగస్వామ్యాలకు ముందుకురావాలని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పిలుపునిచ్చారు.
చదవండి: