Skill University: స్కిల్ వర్సిటీలో విశ్వకర్మలకు కోర్సు
కలెక్టరేట్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 17న బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మల నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సును ప్రవేశపెడతామని తెలిపారు.
కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామని, కరీంనగర్ లో విశ్వకర్మలు భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు.
కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమాధికారి అనిల్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాయితోజు బ్రహ్మచారి, కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిర్యాల బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి హయగ్రీవ చారి, స్వర్ణకార సంఘం అధ్యక్షులు శివప్రసాద్ ,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ శ్రీ రామోజీ రవీంద్రచారి ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రాజు, రవీంద్రచారి, ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి ఉదారం శ్రీనివాస్, నగర విశ్వబ్రాహ్మణ తిప్పారావు శ్రీనివాస్ ,పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కొత్తపల్లి బ్రహ్మచారి, రాష్ట్ర ఐక్య సంఘం ఉపాధ్యక్షుడు చేలోది రాజు, విశ్వకర్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.