Schools Holidays 2023 : అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు పాటు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూలై 20, 21వ తేదీల్లో (గురువారం, శుక్రవారం) సెలవులను ప్రకటించారు. జూలై 22వ తేదీ శనివారం కొన్ని స్కూల్స్‌కు సాధారణంగానే సెలవులు ఉంటుంది. అలాగే జూలై 23వ తేదీ ఆదివారం సెలవు. దీంతో స్కూల్స్‌కు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ వర్షాలు జూలై 25వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒక వేళ ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే.. వర్షాలు పడే ప్రాంతం బట్టి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ 8 జిల్లాలకు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది.
వర్షపాతం నమోదైన జిల్లాలు :
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు ఉన్నాయి. అలగే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలుగా సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.
ప్రజల తిప్పలు..
ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. అలాగే వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండడీ(IMD) జూలై 20 , 21, 2023 తేదీలలో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది.
ఇక్కడ కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు..
భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారులను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు.
అప్పటి వరకు బయటికి వెళ్లకుండా..
జూలై 21 వరకు రాయ్‌గఢ్‌లో ఆరెంజ్ హెచ్చరిక కొనసాగనున్నది. పాల్ఘర్ , థానే జిల్లాలు జూలై 20 వరకు వర్షాలు పడే సమాచారం ఉంది. అధికారులు స్థానికులను ఇంట్లోనే ఉండమని బయటికి వెళ్లకుండా ఉండాలని ప్రోత్సహించారు. యమునా నదికి వరదలు పెరుగుతున్నందున, ఢిల్లీలోని పాఠశాలలు కూడా జూలై 18 వరకు మూసివేసిన విషయం తెల్సిందే.