Heavy Rain: విద్యార్థుల సర్కస్ ఫీట్లు
Sakshi Education
ఇచ్చోడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పా ఠశాలకు వెళ్లే విద్యార్థులకు సర్కస్ ఫీట్లు త ప్పడం లేదు. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పాఠశాల వెళ్లేదారిలో వర్షం నీటితో నిండిపోయింది. ప్రధానగేటు నుంచి పాఠశా ల వరకు దాదాపుగా ఐదు వందల మీటర్ల పొడవున మోకాలిలోతు నీరు నిలిచి ఉండడంతో వి ద్యార్థులకు సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఇనుపగ్రీల్స్‌ను పట్టుకొని పాఠశాలకు చేరుకుంటున్నారు. మరికొందరు మోకాల్లోతు నీటిలోనడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
Published date : 26 Jul 2023 03:18PM