Pre Matric, Post Matric Scholarship: స్కాలర్‌షిప్ హార్డ్ కాపీలు అందించాలి
Sakshi Education
సిరిసిల్ల: జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్–2023కు సంబంధించిన హార్డ్ కాపీలను సమర్పించాలని, 2024కు రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.గౌతమి కోరారు.
కలెక్టరేట్ నుంచి జనవరి 9న వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడారు. స్కాలర్‌షిప్‌లకు సంబంధించి 228 పెండింగ్ హార్డ్ కాపీలు ఈ నెలా ఖరులోగా సమర్పించాలన్నారు.
చదవండి: Scholarships: వెనుకబడిన విద్యార్థినులకు ఉపకార వేతనాలు
అలాగే 2023–24కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 1,673 పూర్తయ్యాయని, వేగవంతం చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ వెల్ఫేర్ అధికారి డాక్టర్ వినోద్‌కుమార్, అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి, పర్యవేక్షకులు అజామ్ పాల్గొన్నారు.
Published date : 10 Jan 2024 04:43PM