Education News: విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం ముఖ్యం
Sakshi Education
వ్యవసాయ డిగ్రీ చదివే విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం ముఖ్యమని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ్ అన్నారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు డిసెంబర్ 13న (బుధవారం) గడ్డిపల్లిని సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు గ్రామస్తులు, రైతులతో మాట్లాడి వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు అంజయ్య, రామయ్య, ఉపేంద్ర, శ్రీనివాస్, నాగయ్య, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు.
Telangana Mega DSc Notification : త్వరలోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేలా..
Published date : 14 Dec 2023 05:20PM