Skip to main content

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగ ఈ క్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ల్యాటరల్‌ ఎంట్రీ భర్తీకి సంబంధించి 113 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
Release of Selection List of Assistant Professor Candidates
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

మొత్తం 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ఇందులో 247 ల్యాటరల్‌ ఎంట్రీ, 375 పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 49 స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీల్లో క్లినికల్, నాన్‌–క్లినికల్‌లో ల్యాటరల్‌ ఎంట్రీ కోసం 501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 367 దరఖాస్తులు అర్హత సాధించగా, మిగిలిన దరఖాస్తులు రిజెక్ట్‌ అయ్యాయి. అర్హత పొందిన దరఖాస్తుల ఆధారంగా 113 పోస్టులు మాత్రమే భర్తీ కాగా, 134 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. అత్యధికంగా నాన్‌–క్లినికల్‌ విభాగంలో ఫిజియాలజీ 21, అనాటమీ 13, మైక్రోబయాలజి 10, క్లినికల్‌లో రేడియాలజిలో 10 పోస్టులు భర్తీ అవ్వలేదు. 

చదవండి: 

Medical Seats: సర్దుబాటులో ఫీజుల రగడ

Andhra Pradesh: వైద్య విధాన పరిషత్‌లో పలు కేడర్లలో మార్పులు

Published date : 27 Sep 2022 03:04PM

Photo Stories