ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం (పార్ట్–2) ఫలితాలను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 25న ప్రకటించింది.
ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాల విడుదల
26 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో నిలిచారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గ్రేస్ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలను విడుదల చేశామన్నారు. రీటోటలింగ్ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2,000 చొప్పున చెల్లించి, ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచారు.