RGUKT: ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2023–24 ఏడాది ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు ట్రిపుల్‌ఐటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్, ఇతర అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 5 నుంచి ఆన్‌లైన్‌లో రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 1,404 జనరల్ సీట్లు, 96 స్పోర్ట్స్ కోటా, 105 గ్లోబల్ కోటాలో సీట్లు కేటాయించారు.
చదవండి: బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్‌కు పేటెంట్
మొత్తంగా 1,605 సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు 7416002245, 7416058245, 7416122245 కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు www. rgukt. ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
చదవండి: RGUKT: బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ఇచ్చిన గుర్తింపు ఇదే..
Published date : 01 Jun 2023 03:12PM