ICAR Exams: రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) 2021 సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ (పీజీ) అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షలో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు.
వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలకు చెందిన బి.తరుణ్ హారి్టకల్చర్ విభాగంలో జనరల్ కేటగిరీలో ఆలిండియా తొమ్మిదో ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించగా.. డి.హాథీరామ్ ప్లాంట్ సైన్స్ విభాగంలో ఎస్టీ కేటగిరీలో ఆలిండియా మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారని కళాశాల అసోసియేట్ డీన్ రాజశేఖర్ వెల్లడించారు. కె.వెంకటరమణ జనరల్ కేటగిరీలో 61వ ర్యాంకు (ఓబీసీ–23), కె.మేఘన సాయిల్ సైన్స్ విభాగంలో 75వ ర్యాంకు (ఓబీసీ –34), ఎస్.ధనుష్ ఎంటమాలజీ, జనరల్ కేటగిరీ లో 76వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్–12) సాధించా రు. సీహెచ్ రుక్తేశ్వర్ (ఓబీసీ–47), బి.నందిని (ఎస్సీ–45), కె.ప్రశాంత్ (ఓబీసీ–192), జి.దివ్య (ఓబీసీ–200), శ్రీకాంత్ (ఎస్టీ–59) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వర్సిటీ వీసీ అభినందించారు.
Published date : 19 Nov 2021 03:35PM