Results: పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
ఈ మేరకు 6వ సెమిస్టర్‌లో మొత్తం 12,833 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే, ఇందులో 7,187 మంది ఉత్తీర్ణత సాధించి 56 శాతం నమోదు చేశారు. 2వ సెమిస్టర్‌లో 12,591 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 4,791 మంది పాసై 38 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. 4వ సెమిస్టర్‌లో 19,118 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,415 మంది విద్యార్థులు పాసై 38.79శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఇక 5వ సెమిస్టర్‌లో 3,559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 2,164 మంది పాసై 59శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్‌లో జరిగే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా కళాశాల యాజమన్యాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గిరిజ, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, నాగభూషణం, కిషోర్, చంద్రకిరణ్, శాంతిప్రియ, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: National Education Policy: సరిహద్దులు దాటి ముందుకు సాగుతున్న విద్య!
రిజిస్ట్రార్‌కు పదవీకాలం పొడిగింపు
పీయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరిజ పదవీ కాలాన్ని పొడిగింపు ఇస్తూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత కాలం ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని, భవిష్యత్‌లో మరింత ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు.