Skip to main content

Harish Rao: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన, పరిశోధనాత్మక విద్యను అందించాలని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు సూచించారు.
Harish Rao
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 2022 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జనవరిలో నిర్వహించనున్న జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పోస్టర్‌ను నవంబర్‌ 21న హరీశ్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో కేఎల్‌ విద్యాసంస్థ ఉపకులపతి సారథి వర్మ, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు, హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ కోటేశ్వరరావుతో కలిసి హరీశ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎల్‌ నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్ష ద్వారా విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను, హైదరాబాద్‌ క్యాంపస్‌లో కలి్పస్తున్న కోర్సులను యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో కేఎల్‌ హైదరాబాద్‌ అడ్మిషన్స్ విభాగం ఇంచార్జి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 

Collector: అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా

Distance Education: ఓయూలో దూరవిద్య ప్రవేశాలు

Education: ఉపాధి వేటలో విజయం సాధించేలా కోర్సులు

Published date : 22 Nov 2021 02:58PM

Photo Stories