Skip to main content

Collector: అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా

అధికారం చాలా మందికి ఉంటుంది... కానీ ఆదుకునే గుణం అందులో కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ ఉంటారు.
Collector
అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా

సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్‌... నవాబుపేటలోని కేజీబీవీకి వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను చూసేందుకు నవంబర్‌ 21న హాస్టల్‌కు వచి్చన బంధువులతో ఆయన మాట్లాడారు. చాలామంది తమ పిల్లలకు పండ్లు, ఇతర వస్తువులు తెచ్చామని చెబితే... ఓ అవ్వ మాత్రం తన మనవరాలిని చూసేందుకు వచ్చానని, కట్టుకునేందుకు పాత దుస్తులు తెచ్చానంది. తల్లిదండ్రి లేని తన మనవరాలు ఇక్కడే ఆరోతరగతి చదువుతోందని, అన్నీ తానై చూసుకుంటున్నానని చెప్పి కంటతడిపెట్టింది. అవ్వ మాటలు విన్న కలెక్టర్‌ చలించిపోయారు. ఆ విద్యారి్థనిని పిలిపించి మాట్లాడారు. ‘ఇంటర్‌ వరకు ఇక్కడే ఉంటది, ఇంకెందుకు బెంగ’అని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరు చూసుకుంటారని ఆ బాలిక కన్నీళ్లు కార్చడంతో కలెక్టర్‌ కదిలిపోయారు. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నావని ప్రశి్నంచగా, పోలీçసు అధికారి కావాలని ఉందని బాలిక సమాధానం చెప్పింది. దీంతో కలెక్టర్‌ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్‌ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యారి్థని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు.

చదవండి: 

OU: 27 భాషల్లో వెబ్‌సైట్‌

AP NIT: ఏపీ నిట్‌లో ఆన్ లైన్ రిపోర్టింగ్‌ చివరి తేదీ ఇదే..

అతిథి దేవోభవ...

Published date : 22 Nov 2021 12:59PM

Photo Stories