బాసర ట్రిపుల్ ఐటీ లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వైస్ చాన్స్‌లర్‌ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
బాసరలో సౌకర్యాలపై ప్రతిపాదనలు
తన కార్యాలయంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ చాన్స్‌లర్, డైరెక్టర్‌తో సెప్టెంబర్ 29న సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇన్నోవేషన్ హబ్‌ను, ఆధునిక కంప్యూటర్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను 45 రోజు ల్లోగా నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని గుర్తించి, నిర్మాణం కోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. మెస్, ఏకరూప దుస్తులు, షూస్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఒక కొలిక్కి తేవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.